ముంబై : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఈనెల 30 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు గాను భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడగాయంతో రెండో టెస్టుతో పాటు వన్డేలకూ దూరమవడంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఈ సిరీస్‌కు తాత్కాలిక సారథిగా రాహుల్‌ను నియమించింది.
వన్డేల్లో మాత్రమే ఆడుతున్న స్టార్ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వగా హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మతో పాటు ఇటీవల దక్షిణాఫ్రికా ‘ఏ’ సిరీస్‌లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాకు జట్టులో చోటు దక్కింది. అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ తమ స్థానాలను కోల్పోయారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బాధ్యతలు మోయనున్నారు.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధృవ్ జురెల్