KL Rahul : వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) మళ్లీ బ్యాట్ పట్టాడు. వన్డే వరల్డ్ జట్టులో చోటే లక్ష్యంగా అతను నెట్స్‌లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాహుల్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్ మునపటి లయ అందుకున్నట్టే కనిపించాడు.
ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో గాయపడిన రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో కోలుకుంటున్నాడు. మోగా టోర్నీలోపు ఫిట్నెస్ సాధించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టాడు. అతను భారత జట్టు తరఫున ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా చివరి వన్డే ఆడాడు.
KL Rahul has started wicketkeeping practice. pic.twitter.com/2iGefgeqc7
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2023
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయిట్స్(Lucknow Super Giants) కెప్టెన్‌గా రాహుల్ బరిలోకి దిగాడు. అయితే.. దురదృష్టవశాత్తూ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. కుడి తొడ పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు. లండన్‌లో సర్జరీ చేయించుకున్న రాహుల్ ఎన్సీఏలో కోలుకుంటున్నాడు.
కేఎల్ రాహుల్
గత కొంత కాలంగా ఈ కుడి చేతివాటం బ్యాటర్ మిడిలార్డర్లో నిలకడగా రాణిస్తున్నాడు. న్యూజిలాండ్ (Newzealand)తో జరిగిన వన్డే సిరీస్‌లో 5వ స్థానంలో ఆడి జట్టును గెలిపించాడు. దాంతో, వరల్డ్ కప్‌లోనూ అతడిని 5వ స్థానంలో ఆడించాలని మేనేజ్మెంట్ అనుకుంది. కానీ, అనూహ్యంగా గాయంతో గాయానికి గురయ్యాడు.
దూకుడుగా ఆడడంతో పాటు కష్ట సమయంలో క్రీజులో పాతుకుపోవడంలో రాహుల్ స్పెషలిస్ట్. పైగా వన్డేల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న స్టయిలిష్ బ్యాటర్ వరల్డ్ కప్‌లో కీలకం కానున్నాడు. అయితే.. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్(Ishan Kishan)అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఇషాన్ కిషన్
తాజాగా వెస్టిండీస్(west inides)పై మూడు వన్డేల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. దాంతో, అతను కూడా పోటీలో ఉండడంతో రాహుల్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది అక్టోబర్ 5న భారత్‌లో వరల్డ్ కప్ మొదలవ్వనుంది. ఆరంభ పోరులో 2019 ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.