BCCI : భారత క్రికెట్ బోర్డు ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. స్పాన్సర్షిప్ హక్కుల (Sponsership Rights) టెండర్లకు ఆహ్వానాలు పలికి ఒక్క రోజు గడువక ముందే దేశవాళీ(Domestic), అంతర్జాతీయ మ్యాచ్ల(International Matches)కు మీడియా హక్కులు(Media Rights) కట్టబెట్టేందుకు సిద్ధపడింది. వన్డే వర్డల్ కప్(ODI World Cup 2023) సమీపిస్తున్నందున మీడియా హక్కుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది. అంతేకాదు ‘ఇన్విటేషన్ టు టెండర్'(Invitation To Tender)లో వివరాలతో పాటు షరతులు స్పష్టంగా పేర్కొంది.
ఆసక్తిగల మీడియా సంస్థలు జీఎస్టీ(GST)తో కలిపి రూ. 15 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజు చెల్లించాలని తెలిపింది. అర్హతలు, అవసరాలు, బిడ్స్ వేయడం, హక్కులు, అభ్యంతరాలు.. ఇవన్నీ టెండర్ ప్రక్రియలో భాగమని బీసీసీఐ వెల్లడించింది. ఐటీటీ ఆసగ్టు 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
🚨 NEWS 🚨 – BCCI announces the release of Invitation to Tender for Media Rights for the BCCI International and Domestic Matches.
More details here 🔽https://t.co/sQ1YRPMTYP
— BCCI (@BCCI) August 2, 2023
‘ఆసక్తిగల కంపెనీలు తప్పనిసరిగా ఐటీటీ కొనుగోలు చేయాలి. అయితే.. అన్ని విధాలా అర్హులైన వాళ్లకు మాత్రమే బిడ్ వేసేందుకు ఎంపిక చేస్తాం. అందుకని ఐటీటీ కొన్నంత మాత్రాన బిడ్ వేసేందుకు ఢోకా లేదని అనుకోవద్దు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బిడ్డింగ్ ప్రక్రియను రద్దు చేసేందుకు సర్వ అధికారాలు బీసీసీఐకి ఉన్నాయి’ అని బీసీసీఐ స్పష్టంగా తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే ఐపీఎల్(IPL), మహిళల ప్రీమియర్ లీగ్(WPL) మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ కోట్లలో గడించిన విషయం తెలిసిందే.