Australian Open 2023 | రెండో రౌండ్లో సింధు, శ్రీకాంత్.. మిక్స్డ్ డబుల్స్ జోడీ ఖేల్ ఖతం
Australian Open 2023 : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2023)లో బోణీ కొట్టింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన ఆమె మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌కు చేరింది. పురుషుల సింగిల్స్ కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), హెచ్ఎస్ ప్రణయ్(HS Pranay), ప్రియాన్షు రజావత్(Priyanshu Rajawat) మొదటి రౌండ్లో...
Australian Open 2023 : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2023)లో బోణీ కొట్టింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన ఆమె మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌కు చేరింది. 47వ ర్యాంకర్ అష్మితా చాలిహ(Ashmita Chaliha)పై 21-18, 21-13తో సింధు విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో ఆమె భారత్‌కే చెందిన ఆకర్షి కష్యప్(Aakarshi Kashyap)ను ఢీ కొట్టనుంది.
పురుషుల సింగిల్స్ కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), హెచ్ఎస్ ప్రణయ్(HS Pranay), ప్రియాన్షు రజావత్(Priyanshu Rajawat) మొదటి రౌండ్లో విజయం సాధించారు. జపాన్ ఓపెన్‌లో విఫలమైన ప్రణయ్ హాంకాంగ్‌కు చెందిన చెక్ యూను చిత్తు చేశాడు. మూడు సెట్లలో జోరుగా ఆడిన భారత షట్లర్ 21-18, 16-21, 21-15తో గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మరో మ్యాచ్‌లో 19వ ర్యాంకర్ శ్రీకాంత్ జపాన్ ఆటగాడైన కెంటా నిషిమొటోపై 21-18, 21-7తో అవలీలగా గెలుపొందాడు. యంగ్‌స్టర్ ప్రియాన్షు వైల్డ్ కార్డ్ ప్లేయర్ నాథన్ టాంగ్పై 21-12, 21-16తో విజయం సాధించాడు.
అశ్విని పొన్నప్ప, సుమీత్ రెడ్డి

మిక్స్డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి(Sumeeth Reddy), అశ్విని పొన్నప్ప(Ashwini Ponnappa) ఇంటిబాట పట్టారు. జపాన్‌కు చెందిన హిరోకి మిడోరికవా, నాట్సు సాయిటోపై 13-21, 12-21తో వరుస సెట్లలో ఓడిపోయారు. సింధుతో పాటు వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)కు అర్హత సాధించాలనుకుంటున్న ఇండియన్ షట్లర్లకు ఈ ఓపెన్ చాలా కీలకం. ఈ ఏడాది మే 1 నుంచి బ్యాడ్మింటన్ క్వాలిఫై రేసు మొదలైంది. దాంతో, ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ మనోళ్ల ఒలింపిక్ బెర్తును నిర్ణయించనుంది.
ఇవి కూడా చదవండి
BCCI | బీసీసీఐ మీడియా హక్కుల టెండర్ విడుదల
Test Rankings | ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కొంపముంచిన స్లో ఓవర్ రేటు.. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇరుజట్లకు భారీ షాక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

