KL Rahul : భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) సొగసైన ఆటకు కేరాఫ్. టీమిండియా తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ దులీప్ ట్రోఫీ(Duleep Trophy)కి సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి గురించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రాహుల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ స్టార్ ప్లేయర్ సిగ్నేచర్ స్టయిల్ సెలబ్రేషన్ ఫొటోతో పాటు సుదీర్ఘ పోస్ట్ ఉంది. దాంతో, ఆ పోస్ట్ చూసిన అభిమానులంతా షాకయ్యారు. అరే.. ఏమైంది. రాహుల్ ఎందుకు వీడ్కోలు పలికాడు. అసలు ఈ వార్త నిజమేనా? అంటూ అమోమయానికి గురవుతున్నారు.
Some fake photos are viral from insta handle of klrahul but it’s nothing like that…..nothing is official neither from him and bcci …do not belive until.its confirm ….#klrahul #cricket #bcci #ipl #lsg #india #dream11 #india11 #IndianCricketTeam #jayshah #virat pic.twitter.com/UV0NZ5tj2e
— SATYENDRA NAIN (@SatyendraNain) August 22, 2024
అసలు ఆ పోస్ట్‌లో ఏం ఉందంటే.. సుదీర్ఘ సమాలోచన, చాలా చర్చల తర్వాత ఫ్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. నా జీవితంలో కీలక భాగమైన క్రికెట్‌కు ఆటకు అల్విదా చెప్పడం సులువైన నిర్ణయం కాదు అని రాసి ఉంది. దాంతో, ఫ్యాన్స్‌తో పాటు పలువురు క్రికెటర్లు సైతం ఇదేంటీ? రాహుల్ వీడ్కోలు చెప్పాడా? అని ఆందోళనకు లోనయ్యారు. అయితే.. అదంతా ఫేక్ న్యూస్ అని సమాచారం. దాంతో, అభిమానులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
తాను క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్టు వన్తున్న వార్తలపై రాహుల్ స్పందించాడు. ‘నేను ఓ ప్రకటన చేయబోతున్నా. వేచి ఉండండి’ అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. దాంతో, రాహుల్ ఏం అనౌన్స్మెంట్ చేయనున్నాడు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు.
వన్డే వరల్డ్ కప్ తర్వాత సర్జరీ చేయించుకున్న రాహుల్ టీ20 వరల్డ్ కప్ ఆడలేదు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఈ స్టార్ ఆటగాడు.. మనపటిలా చెలరేగలేకపోయాడు.