Tirumala | తిరుమలకు వచ్చిన ముగ్గురు భక్తులు ఇవాళ అందర్నీ ఆకర్షించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన వారు మెడలో తాళ్ల సైజులో ఉన్న గొలుసులు, చేతికి కడియాలు, ఉంగరాలు వేసుకుని వచ్చారు. దాదాపు పాతిక కిలోల బంగారాన్ని ధరించడం చూసి అంతా అవాక్కయ్యారు. దీంతో వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
మహారాష్ట్రలోని పుణెకు చెందిన గోల్డెన్ బాయ్స్ సన్నీ నన వాగ్చోరీ, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోనీలు ఇవాళ ఉదయం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. అయితే దర్శన సమయంలో ఒంటి నిండా బంగారం ధరించుకున్నారు. అది చూసిన భక్తులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో వారిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు అక్కడి భక్తులు ఎగబడ్డారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ రావడం విశేషం. కాగా, సన్నీ నన వాగ్చోరీ, సంజయ్ దత్తాత్రేయ గుజర్ ఇద్దరూ చెరో 10 కిలోల బంగారం ధరించగా.. ప్రీతి సోనీ 5 కేజీల బంగారం ధరించినట్లు సమాచారం.
తిరుమల: వేంకటేశ్వరుడిని దర్శించుకున్న పూణేకు చెందిన గోల్డెమాన్లు సన్నీ నన వాగ్చోరీ, సంజయ్ దత్తత్రయ గుజర్, ప్రీతి సోనీ. #Tirumal #Tirupati #TTD #PuneGoldMen #NewsUpdates #Bigtv @TTDevasthanams pic.twitter.com/xWbMYU20QI
— BIG TV Breaking News (@bigtvtelugu) August 23, 2024