అమరావతి : సరదా కోసం సెల్ఫీ (Selfie,) ఫొటోలు, వీడియోలకు ప్రాధాన్యం ఇస్తున్న యువత ఆ క్షణంలో పొంచి ఉన్న ముప్పును గమనించక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సెల్ఫీలు తీపిగుర్తులుగా బదులు మరచిపోని ఘటనలకు దారితీస్తున్నాయి. విజయవాడ(Vijayawada) రూరల్ మండలం పాతపాడులో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఐదుగురు స్నేహితులు మద్యం సేవించి చేపల చెరువు వద్దకు వెళ్లారు. వీరంతా నాటుపడవ(Boat) ఎక్కి సెల్ఫీలు దిగుతుండగా నాటుపడవ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఇద్దరు యువకులు నీట మునిగి చనిపోగా మరో ముగ్గురిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనలో శివానంద్(23), రవికుమార్(21) మృతి చెందినట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.