Team India : భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) గాయపపడంతో తదుపరి నాయకుడు ఎవరు? అనే సంధిగ్దతకు తెరపడింది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం కేఎల్ రాహుల్(KL Rahul)కు పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు. దాంతో.. మళ్లీ రోహిత్ శర్మకు సారథ్యం ఇస్తారనే వార్తలకు చెక్ పడింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బృందం ఆదివారం 15మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇండియా ఏ తరఫున శతకంతో రెచ్చిపోయిన రుతురాజ్ గైక్వాడ్, ఏడాది క్రితం చివరి వన్డే ఆడిన రిషభ్ పంత్ (Rishabh Pant)కు జాబితాలో చోటు దక్కింది.
ఇటీవలే వన్డే సారథిగా రోహిత్ నుంచి పగ్గాలు అందుకున్న శుభ్‌మన్ గిల్ కోల్‌కతా టెస్టులో గాయపడి ఆటకు దురమయ్యాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లోపు అతడు కోలుకునే అవకాశాలు లేకపోవడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. నవంబర్ 30 నుంచే సిరీస్ ప్రారంభం కానున్నందున ఆదివారం స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు.
🚨 NEWS 🚨#TeamIndia‘s squad for @IDFCFIRSTBank ODI series against South Africa announced.
More details ▶️https://t.co/0ETGclxAdL#INDvSA pic.twitter.com/3cXnesNiQ5
— BCCI (@BCCI) November 23, 2025
జట్టుకోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే రాహుల్‌ను సెలెక్టర్లు విస్మరించలేదు. ఓపెనర్ నుంచి ఏడో స్థానంలో.. ఎక్కడంటే అక్కడ ఆడుతూ జట్టు మనిషిగా పేరు తెచ్చుకున్న అతడికి కెప్టెన్సీ కట్టబెట్టారు. ఇప్పటివరకూ రాహుల్ 15 వన్డేల్లో నాయకత్వం వహించి.. 9 విజయాలు అందించాడు. సారథిగా బ్యాటుతోనూ రాణించిన అతడు 302 రన్స్ చేశాడు. ఇక ఐపీఎల్లో కెప్టెన్‌గా అదరగొట్టిన పంత్.. చివరి వన్డే ఆడి దాదాపు ఏడాది అవుతోంది. అతడికి కూడా 50 ఓవర్ల ఫార్మాట్లో ఆడే అవకాశం లభించింది.
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రానా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.
Finally Ruturaj Gaikwad added to the main Indian squad for the ODI series against South Africa.
Rohit Sharma & Yashasvi Jaiswal are already there for opening, so it’s going to be tough for him to make a place but hopefully it will add to his experience 👊pic.twitter.com/s9L8Nr4Qo3
— Tejash (@Tejashyyyyy) November 23, 2025
ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లీకి మరో అవకాశమిచ్చారు సెలెక్టర్లు. యువకెరటాలు యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మలు స్క్వాడ్‌లో వచ్చారు . భారత ఏ తరఫున అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ఏడాది కాలంగా వన్డేల ముఖం చూడని రిషభ్ పంత్‌లపై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. అయితే.. ఈసారి కూడా షమీకి చుక్కెదురైంది. పేస్ బౌలింగ్ దళంలో అర్ష్‌దీప్ సింగ్‌కు స్థానం లభించింది. అతడితో పాటు హర్షిత్ రానా, ప్రసిధ్ కృష్ణలు ఎంపికయ్యారు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్.. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌కు ఓటేశారు సెలెక్టర్లు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రాంచీలో నవంబర్ 30న తొలి వన్డే జరుగనుంది. రాయ్‌పూర్‌లో డిసెంబర్ 3న రెండో మ్యాచ్.. వైజాగ్‌లో డిసెంబర్ 6న మూడో మ్యాచ్ నిర్వహించనున్నారు.