IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో కొందరు ఆటగాళ్ల జెర్సీలు మారాయి. కొత్త జట్టు తరఫున ఆడుతూ తమ పాత ఫ్రాంచైజీకి చుక్కలు చూపిస్తున్నారు. గత ఎడిషన్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్(KL Rahul) సైతం ఇదే సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రాహుల్.. లక్నోపై చెలరేగి ఆడాలని భావిస్తున్నాడు. 17వ సీజన్లో తనను అవమానపరిచిన లక్నో యజమాని సంజీవ్ గొయెంకా పై ప్రతీకారం తీర్చుకునేందుకు కాచుకొని ఉన్నాడీ వికెట్ కీపర్. దాంతో.. ఎల్ఎస్జీపై రాహుల్ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. ఢిల్లీ మిడిలార్డర్‌కు వెన్నెముకలా నిలుస్తూ మ్యాచ్ విన్నర్ అనిపించుకుంటున్నాడు. ఆర్సీబీపై అజేయ అర్థ శతకం బాదిన రాహుల్.. లక్నోపై చెలరేగేందుకు ఎదురు చూస్తున్నాడు.
17వ సీజన్లో సన్‌రైజర్స్ చేతిలో 10 వికెట్ల తేడాతో లక్నో ఓడిపోయింది. అనంతరం సంజీవ్ గోయెంకా మైదానంలో అందరు చూస్తుండగానే రాహుల్‌ను తిట్టిపోశాడు. దాంతో, సంజీవ్ తీరును విమర్శిస్తూ ఆన్లైన్లో పోస్టులు వెలిశాయి.
KL Rahul vs this egomaniac Goenka for the first time today. We are all on KL and DC’s side 🙌 pic.twitter.com/QgDTL80mOW
— Vipin kumar (@VVipinpatel) April 22, 2025
తన ప్రవర్తనతో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కెప్టెన్‌ను ఇంటికి ఆహ్వానించిన గొయెంకా.. ఇద్దరం కలిసిపోయామనే సంకేతాలు ఇచ్చాడు. అయితే.. 18వ ఎడిషన్‌లో లక్నోతో కొనసాగేందుకు రాహుల్ ఇష్టపడలేదు. స్వేచ్ఛగా ఉండే వేలానికి వచ్చిన అతడిని రూ.14 కోట్లకు కొన్నది. తమకు విజయకాంక్షతో రగిలిపోయే సారథి కావాలని చెప్పిన సంజీవ్ మాత్రం రిషభ్ పంత్‌ను రికార్డు ధరకు కొన్నాడు. రూ. 27 కోట్లకు పంత్‌ను తీసుకొని అతడికి పగ్గాలు అప్పగించాడు.