భిక్కనూరు, ఏప్రిల్ 22 : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో ధరిత్రి దినోత్సవాన్ని ఈకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ఏప్రిల్ 22న ప్రతి సంవత్సరం జీవవైద్యాన్ని కాపాడటం, అందరిలో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం భూతాపం తగ్గించాలంటే సోలార్, పవన, జియో థర్మల్ వంటి వనరులను ఉపయోగించుకోవాలన్నారు.
పునరుత్పత్తి కలిగిన శక్తి వనరులను ఉపయోగించుకున్నట్లయితే భూ గ్రహాన్ని కాపాడిన వాళ్లమవుతారన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి ఈకో క్లబ్ విద్యార్థులను అభినందించి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం దక్షిణ ప్రాంగణంలో అధ్యాపకులు, విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్య క్రమంలో డాక్టర్ లలిత, డాక్టర్ హరిత, డా. ప్రతిజ్ఞ, డాక్టర్.అంజయ్య, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ సబిత పాల్గొన్నారు.