KKR vs RCB | ఐపీఎల్ 20201లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబిలో జరుగుతున్న రాయల్ ఛాలెంజర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే విరాట్ కోహ్లీ (5 ) ఔటయ్యాడు. దీంతో 10 పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. మొదట టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది. విరాట్ కోహ్లీ, పడిక్కిల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి వచ్చారు. అయితే రెండో ఓవర్లో ప్రసిధ్ కృష్ణ వేసిన 1.4 ఓవర్‌కు కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.