KKR Vs CSK | చెన్నై సూపర్‌కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్నది. కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఒక మార్పు చేసింది. వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ స్థానంలో మనీష్ పాండేను తుది జట్టులోకి తీసుకుంది. అలాగే, సీఎస్కే సైతం ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగబోతుంది. శామ్ కుర్రాన్, షేక్ రషీద్ స్థానంలో డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్‌కు చోటు కల్పించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: ఆయుష్ మ్హత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, రవిచంద్రన్ అశ్విన్, ఎంఎస్ ధోని (కెప్టెన్-వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతిషా పతిరాన.
ఇంపాక్ట్ ప్లేయర్స్: శివమ్ దూబే, కమలేశ్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్, దీపక్ హుడా.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, లవ్నిత్ సిసోడియా, అన్రిచ్ నార్ట్జే, మయాంక్ మార్కండే.