KKR Vs CSK | కోల్‌కతా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 179 పరుగులు చేసింది. చెన్నై ముందు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే తరఫున నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజాకు తలో వికెట్ దక్కింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (11) పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత సునీల్ నరైన్ సైతం ఆకట్టుకోలేకపోయాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 26 పరుగులు చేశాడు. దూకుడు ఆడేందుకు ప్రయత్నించి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ (1) సైతం నిరాశపరిచాడు. 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌ను కెప్టెన్ రహానే ఆదుకున్నాడు. ఆండ్రీ రస్సెల్ (38) సహాయంతో ఇన్సింగ్స్‌ను చక్కదిద్దాడు.
మనీష్ పాండే (36 నాటౌట్) సైతం జతకలిశాడు. రహానే అర్ధశతకానికి చేరువలో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రింకు సింగ్ సింగ్ (9) నూర్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. రమణ్‌దీప్ సింగ్ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంభోజ్, రవీంద్ర జడేజాకు చెరో వికెట్ దక్కింది.