మౌంట్ మాంగనుయ్: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. బే ఓవల్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన నాలుగో టీ20లో కివీస్.. 115 పరుగుల భారీ తేడాతో నెగ్గి సిరీస్‌లో 3-1 ఆధిక్యాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫిన్ అలెన్ (20 బంతుల్లో 50, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ మైఖేల్ బ్రాస్‌వెల్ (26 బంతుల్లో 46 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సీఫర్ట్ (22 బంతుల్లో 44, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారం చేశారు. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్.. ఛేదనలో 16.2 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది.