మౌంట్ మౌంగనుయి(న్యూజిలాండ్): పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో వన్డేలో కివీస్ 43 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. తొలుత కెప్టెన్ మిచెల్ బ్రేస్‌వెల్(59), రైస్ మారివు(58) అర్ధసెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 264/8 స్కోరు చేసింది. పాక్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ కివీస్ సాధికారిక స్కోరు సాధించింది.
అఖిఫ్ జావెద్(4/62) నాలుగు వికెట్లతో విజృంభించాడు. లక్ష్యఛేదనకు దిగిన బెన్సీయర్స్(5/34) ధాటికి పాక్ 40 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్(50) అర్ధసెంచరీ ప్రదర్శన మినహా ఎవరూ రాణించలేకపోయారు. బ్రేస్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.