Kidambi Srikanth | మకావు: సుమారు నాలుగు నెలల విరామం తర్వాత రాకెట్ పట్టిన భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్ మకావు ఓపెన్‌లో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్.. 21-14, 21-15తో డేనిల్ డుబొవెంకో (ఇజ్రాయెల్)ను వరుస సెట్లలో చిత్తు చేసి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. రెండో రౌండ్లో అతడు భారత్‌కే చెందిన అయూష్‌తో తలపడనున్నాడు.
వినేశ్‌కు నాడా నోటీసులు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) బుధవారం నోటీసులు జారీ చేసింది. తాను ఎక్కడ ఉంటుందన్న విషయంలో సరైన స్పష్టత లేని కారణంగా నోటీసులు ఇచ్చిన నాడా 14రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. నాడాకు చెందిన ప్రత్యేక టూల్లో ప్లేయర్లు తమ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో వినేశ్ విఫలం నోటీసులకు దారితీసింది.