Kho Kho World Cup | ఖోఖో పురుషుల ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను భారత జట్టు మట్టికరిపించింది. ఖోఖో ప్రపంచకప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. భారత్ తొలి ప్రపంచకప్‌లోనే విజయం సాధించింది. నేపాల్‌పై 54-36 తేడాతో భారత జట్టు గెలుపొందింది. తొలి టర్న్‌లో 26-0 ఆధిక్యంలో నిలిచింది. టర్న్2లో నేపాల్ పుంజుకొని 18 పాయింట్లు సాధించింది. ఇక టర్న్-3లో ముగిసే వరకు భారత్ 54-36 పాయింట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన మహిళల ఫైనల్లో నేపాల్‌పై భారత జట్టును గెలుపొందింది.
ఫైనల్లో భారత్ 78-40 తేడాతో నేపాల్‌ను ఓడించింది. తుది పోరు టర్న్1లో భారత్ దూకుడుగా ఆడింది. దాంతో 34-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత నేపాల్ సైతం పుంజుకుంది. దాంతో స్కోర్ 34-24కి చేరింది. మూడో టర్న్‌లో భారత్ మళ్లీ విజృంభించి ఆధిక్యాన్ని 49కి పెంచుకుంది. చివరి టర్న్‌లో 16 పాయింట్లు సాధించగా.. 38 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఇక జాతీయ ఖోఖో జట్లకు ఒడిశా స్పాన్సర్‌గా వ్యవహరించింది. భారత ఖోఖో జట్లు విజయం ప్రపంచకప్ గెలువడంతో ఒడిశాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మూడేళ్ల స్పాన్సర్‌షిప్‌లో భాగంగా ఒడిశా రూ.5కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2025 నుంచి డిసెంబర్ 2027 వరకు స్పాన్సర్షిప్ కాలంలో రూ.15కోట్ల ప్యాకేజీని అందించనున్నది.