హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర గిరిజన సాంసృతిక పరిశోధనా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ కెనో స్ప్రింట్ చాంపియన్ షిప్ 2025 పోటీలు శుక్రవారంతో ముగిశాయి.
తెలంగాణ జట్లు అత్యధిక పతకాలు గెలుచుకొని ఓవరాల్ ఛాంపియన్‌గా నిలువగా అస్సాం, మహారాష్ట్ర వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ముగింపు వేడుకలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.