Srilanka Cricket : స్వదేశంలో న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్ విజయంతో జోరుమీదున్న శ్రీలంక (Srilanka) ఈసారి దక్షిణాఫ్రికా సవాల్‌కు సన్నద్దం అవుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌పై గురి పెట్టిన లంక.. సఫారీలతో రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 27న తొలి టెస్టు ఉన్నందున లంక సెలెక్టర్లు మంగళవారం స్క్వాడ్‌ను ప్రకటించారు. ధనంజయ డిసిల్వా కెప్టెన్‌గా 17మందితో కూడిన బలమైన బృందాన్ని ఎంపిక చేశారు.
సీనియర్లతో పాటు కుర్రాళ్లు కూడా శతకాల మోత మోగిస్తుండడంతో సెలెక్టర్లు రెండు మార్పలుతోనే సరిపెట్టారు. కివీస్‌తో సిరీస్‌కు దూరమైన సీనియర్ పేసర్ కసున్ రజిత్ మళ్లీ జట్టులోకి రాగా.. రెండేండ్ల అనంతరం స్పిన్నర్ లసిత్ ఎంబుల్డెనియా తొలి టెస్టు సిరీస్ ఆడబోతున్నాడు. ఆల్‌రౌండర్లు రమేశ్ మెండిస్, జెఫ్రే వాండర్సేల స్థానంలో ఈ ఇద్దరికి స్క్వాడ్‌లో చోటు దక్కింది. లసిత్ చివరిసారిగా 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన గాలే టెస్టులో ఆడాడు.
Slow left-arm orthodox back in Sri Lanka’s Test team after two years for the #WTC25 series against South Africa 👤🏏#SAvSL | More ⬇️https://t.co/BpIyPHn194
— ICC (@ICC) November 19, 2024
శ్రీలంక స్క్వాడ్ : ధనంజయ డిసిల్వా(కెప్టెన్), పథుమ్ నిశాంక, దిముత్ కరుణరత్నే, దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, ఒషాడో ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, లసిత్ ఎంబ్లుడెనియ, మిలాన్ రత్ననాయకే, అసిథ ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, లహిరు కుమార, కసున్ రజిత.
ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన శ్రీలంక అనూహ్యంగా ఓవల్ మైదానంలో రెచ్చిపోయి ఆడింది. చిరస్మరణీయ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులోకి వచ్చింది. ఆపై స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తూ 2-0తో సిరీస్ కొల్లగొట్టింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరుగబోయే రెండు టెస్టుల సిరీస్ లంకకు కీలకం కానుంది. నవంబర్ 29న డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ మైదానంలో సఫారీలతో లంక తలపడనుంది. అనంతరం డిసెంబర్ 5న ఇరుజట్లు రెండో టెస్టులో ఢీకొననున్నాయి.