Blind T20 World Cup : ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు కోల్పోయే ప్రమాదంలో పడిన పాకిస్థాన్‌కు మరో షాక్. ఆ దేశంలో జరగాల్సిన అంధుల టీ20 వరల్డ్ కప్(Blind T20 World Cup) నుంచి భారత పురుషుల జట్టు వైదొలిగింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో పొట్టి కప్‌లో టీమిండియా ఆడడం లేదు.
ఈ విషయాన్ని మంగళవారం భారత అంధుల క్రికెట్ సంఘం సెక్రటరీ శైలేంద్ర యాదవ్(Sailendra Yadav) వెల్లడించాడు. ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లుఈ వరల్డ్ కప్‌లో ఆడడం లేదు. ఇప్పుడు భారత జట్టు కూడా టోర్నీకి దూరం కావడంతో పాక్ బోర్డు అయోమయంలో పడింది.
MEA denies permission to blind cricket team to travel Pakistan
Indian team to withdraw from the T20 World Cup- sailendra Yadav gen secy cabi to sports tak aajtak
— Nitin K Srivastav (@Nitin_sachin) November 19, 2024
‘పాకిస్థాన్ వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోసం మేము గత 25 రోజుల నుంచి ఎదురుచూశాం. అయితే టోర్నీ మరో నాలుగు రోజుల్లో మొదలవ్వనుంది. అందుకని మేము ఇక నిరీక్షించాలని అనుకోవడం లేదు. నేను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో మాట్లాడాను. అప్పుడు ఒకవేళ పాకిస్థాన్‌కు వెళేందుకు ప్రభుత్వ అనుమతి లభించకుంటే టోర్నీని రద్దు చేసుకోవాల్సి వస్తుందని ఆ శాఖ ప్రతినిధి మాకు చెప్పారు.
Pakistan Breaks Silence On Row Over Indian Blind Cricket Team’s T20 World Cup Planshttps://t.co/TKOyp5Hk2p pic.twitter.com/I1Au99Q8Cd
— CricketNDTV (@CricketNDTV) November 12, 2024
అంతేకాదు అనుమతి నిరాకరణ పేరుతో అధికారిక ఉత్తరం కూడా త్వరలోనే వస్తుందని కూడా తెలియజేశారు. కానీ, ఇంతవరకూ మాకు ఎలాంటి లేఖ అందలేదు. అందుకని మేము పాకిస్థాన్‌లో జరగనున్న అంధుల టీ20 వరల్డ్ కప్ పోటీలకు వెళ్లడం లేదు’ అని శైలేంద్ర చెప్పుకొచ్చాడు. నవంబర్ 23 నుంచి పాక్ వేదికగా అంధుల టీ20 వరల్డ్ కప్ పోటీలు షురూ కానున్నాయి. ఈ మెగా టోర్నీ డిసెంబర్ 3న ముగియనుంది. గతంలో మూడుసార్లు (2012, 2017, 2022) చాంపియన్ అయిన భారత జట్టు ఈసారి ఆడకపోతుండడంతో అంధుల టీ20 వరల్డ్ కప్ టోర్నీ కళ తప్పేలా ఉంది.