Ricky Ponting : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2023-25) ఫైనల్ బెర్తును నిర్ణయించే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్, ఆస్ట్రేలియాలు కాచుకొని ఉన్నాయి. నవంబర్ 22న పెర్త్ (Perth) వేదికగా తొలి టెస్టు జరుగనుంది. గత పర్యటనల్లో ఆసీస్‌కు షాకిచ్చిన టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు భారత జట్టు గట్టి సవాల్ విసురుతుందని పాంటింగ్ అన్నాడు. అంతేకాదు కంగారూ జట్టుకు కఠిన ప్రత్యర్థిగా టీమిండియా అవతరించిందని రికీ తెలిపాడు. ‘ఈమధ్య కాలంలో ఆస్ట్రేలియాకు తగ్గ పోటీదారుగా భారత జట్టు ఎదిగింది.
When Virat Kohli played first time in AUSTRALIA.
At 23, Virat Kohli was India’s highest run-scorer in the 2012 BGT, in a team consisting of Sachin, Dravid, Sehwag, and Laxman. 🐐
pic.twitter.com/npPC1y9kOO— Krishna. (@KrishVK_18) November 17, 2024
ఇక ఇంగ్లండ్ గురించి ఆందోళన అవసరం లేదు. టీమిండియాపై దృష్టి పెట్టాలి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టుతో ఆసీస్ తలపడింది. అనంతరం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఇరుజట్లు ఢీకొన్నాయి. ఇప్పటి భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది’ అని పాంటింగ్ వెల్లడించాడు. కంగారూ జట్టు మాత్రం ఈసారి ట్రోఫీని వదిలేయొద్దనే కసితో పెర్త్ పిచ్ పేస్‌కు, బౌన్స్‌కు అనుకూలించే విధంగా 10 మిల్లీ మీటర్ల ఎత్తులో గడ్డి పెంచుతోంది కూడా.