Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ ధాన్’ సెట్స్‌లో మొదలైన విఘ్నేష్ శివన్‌తో ప్రేమకథ, వివాహంతో సహా నయనతార కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఇక డాక్యుమెంటరీ విషయంలో సౌత్ సూపర్ స్టార్ ధనుష్‌పై నయనతార ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నానుమ్ రౌడీ ధాన్ మూవీలో సీన్స్‌ను వాడుకోవడంతో నయనాతారకు ధనుష్ లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. మూడు సెకన్ల వీడియోకు రూ.10కోట్లు డిమాండ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నయనతారకు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మద్దతు ప్రకటించింది.
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెటరీని ప్రశంసించింది. బలమైన మహిళను మరింత శక్తివంతంగా చూడటం కంటే స్పూర్పినిచ్చేది ఇంకేది లేదు’ అంటూ జాన్వీ కపూర్ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. నయనతార జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది. ప్రస్తుత డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నది. పలువురు సెలబ్రిటీలు నయన్‌ను అభినందించారు. ఇదే క్రమంలో జాన్వీకపూర్ సైతం స్పందించింది. ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రాం చరణ్, బుచ్చిబాబు సినిమాలో నటిస్తున్నది. సన్నీ సంస్కారి కి తులసి కుమారి మూవీలో నటిస్తున్నది.