తిరుమల : టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లను (TTD calendars ) టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు తిరుమల అన్నమయ్య భవనంలో ఆవిష్కరించారు. టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుమలలోని భూ వరాహ స్వామి ( Bhu Varahaswamy) , తిరుపతి సమీపంలోని పేరూరు వకుళమాత ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి మూర్తులతో కూడిన క్యాలెండర్లను ముద్రించింది.
నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామి (Kalyana Venkateshwar Swamy), నాగలాపురం వేద నారాయణస్వామి, కార్వేటినగరం వేణుగోపాలస్వామి, ఒంటిమిట్ట కోదండరామస్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులతో కూడిన క్యాలెండర్లను టీటీడీ ముద్రించింది. ఈ క్యాలెండర్లు బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు .ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి హెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈవో వీరబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మొత్తం 31 కంపార్టుమెంట్లకు గాను కేవలం ఒక కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 62,085 మంది భక్తులు దర్శించుకోగా 21,335 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.78 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.