తిరువనంతపురం: సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో భారత జట్టుకు ఎంపికై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కరుణ్ నాయర్.. దేశవాళీలో మాత్రం తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బీలో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో కరుణ్ (142*) అజేయ శతకంతో కదం తొక్కాడు. అతడితో పాటు స్మరణ్ (88*), శ్రీజిత్ (65) రాణించడంతో తొలి రోజు కర్నాటక.. 319/3 స్కోరు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.