Kapil Dev | నేనూ మోటార్ సైకిల్ ప్రమాదానికి గురయ్యా.. సొంతంగా కారు నడపొద్దు
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి రోర్కీ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాగా, ఈ ఘటనపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఇదో గుణపాఠం అంటూ చెప్పుకొచ్చారు.
Kapil Dev | టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి రోర్కీ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాగా, ఈ ఘటనపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఇదో గుణపాఠం అంటూ చెప్పుకొచ్చారు.
ఇటీవల ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘ఇదొక గుణ పాఠం. నేను కూడా కెరీర్ మొదట్లో మోటారు సైకిల్ ప్రమాదానికి గురయ్యాను. ఆ రోజు నుంచి నా సోదరుడు నన్ను బైక్‌ను ముట్టనివ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో ఇతర స్టార్ క్రికెటర్స్‌కి పలు సూచనలు చేశారు.
‘నీ దగ్గర అద్భుతమైన కార్లు ఉన్నాయి. అవి చాలా వేగంగా దూసుకెళ్తాయి. కానీ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ డ్రైవర్‌ను నియమించుకోవడం నీకు భారం కాదు. నీవు సొంతంగా కారును నడపకూడదు. ఎవరికైనా ఈ తరహా కోరికలు ఉంటాయి. ఈ వయసులో ఉన్న వారికి ఇలాంటి కోరికలు ఉండడం సహజమే. కానీ, నీకంటూ బాధ్యతలు ఉన్నాయి. నీ గురించి నీవే జాగ్రత్తలు, తగిన నిర్ణయాలు తీసుకోవాలి’ అని కపిల్ దేవ్ పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆ దేవుడి దయవల్ల రిషబ్ ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయడపడ్డాడు అని అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

