Newzealand Cricket : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి సీజన్ విజేత న్యూజిలాండ్ (Newzealand) ఈసారి రేసులో వెనకబడింది. ఈమధ్యే శ్రీలంక చేతిలో వైట్‌వాష్‌కు గురైన కివీస్.. భారత పర్యటనలోనైనా తమ పాయింట్లు పెంచుకోవాలని ఆశపడింది. కానీ, ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. మాజీ కెప్టెన్, కేన్ విలియమ్సన్ (Kane Williasmson) ఇండియాతో టెస్టు సిరీస్‌లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. గజ్జల్లో నొప్పి కారణంగా విలియమ్సన్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. దాంతో, అతడు భారత పర్యటనకు జట్టుతో కలిసి రావడం లేదు. ఈ విషయాన్ని మీడియాతో బుధవారం న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది.
అసలేం జరిగిందంటే.. శ్రీలంకతో రెండో టెస్టు సమయంలో విలియమ్సన్ ఇబ్బందిగా ఫీలయ్యాడు. గజ్జల్లో నొప్పితో బాధ పడిన అతడు సరిగా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయలేకపోయాడు. అందుకని విలియమ్సన్కు కొన్ని రోజులు రిహాబిలేషన్లో గడుపాలని వైద్యులు సూచించారు. ‘వైద్యుల సలహా మేరకు అతడి విశ్రాంతి ఇస్తున్నాం. అయితే.. అతడు తొందరగా కోలుకుని భారత్‌తో టెస్టు సిరీస్ ఆడుతాడని ఆశిస్తున్నాం. ఇక తొలి టెస్టుకోసం అతడి స్థానంలో మరొకరిని ఎంపిక చేయనున్నాం ‘అని న్యూజిలాండ్ సెలెక్టర్ సామ్ వెల్స్ తెలిపాడు.
ICYMI | Our Test squad for the upcoming three-Test series against India, starting in Bengaluru next Wednesday. Watch all matches LIVE on @skysportnz 🏏 #INDvNZ #CricketNation pic.twitter.com/TzvMIpZSrH
— BLACKCAPS (@BLACKCAPS) October 8, 2024
విలియమ్సన్ స్థానంలో యువకెరటం మార్క్ చాప్మన్ (Mark Chapman) జట్టులోకి వస్తాడని కివీస్ వర్గాలు చెబుతున్నాయి. వన్డే, టీ20ల్లో అదరగొడుతున్న ఈ యంగ్‌స్టర్‌కు ఫస్ట్ క్లాస్‌లో 41.9 సగటు ఉంది. పైగా ఆరు సెంచరీలతో బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. అందుకని మిడిలార్డర్లో చాప్‌మన్‌ను ఆడించాలని న్యూజిలాండ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. భారత్, కివీస్‌ల మధ్య అక్టోబర్ 16న బెంగళూరులో తొలి టెస్టు జరుగనుంది.
న్యూజిలాండ్ స్క్వాడ్ : టామ్ లాథమ్(కెప్టెన్), టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), మైఖేల్ బ్రాస్‌వెల్(తొలి టెస్టు కోసమే), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిఫ్స్, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధీ(రెండు, మూడో టెస్టు కోసం), టిమ్ సౌథీ, విల్ యంగ్, అజజ్ పటేల్, విలో ఓ రూర్కీ, మ్యాట్ హెన్రీ,