న్యూఢిల్లీ: ధ్వని వేగానికి మించిన వేగంతో ప్రయాణించే ‘హైపర్‌సానిక్ జెట్’ రూపకల్పనలో ముందడుగు పడింది. అమెరికా స్టార్టప్ ఇంజినీరింగ్ కంపెనీ ‘వీనస్ ఏరోస్పేస్’ అభివృద్ధి చేసిన ‘హైపర్‌సానిక్ జెట్’ టెస్ట్ ఫ్లైట్‌కు సిద్ధమైంది. 2025లో టెస్ట్ ఫ్లైట్ నిర్వహించేందుకు ‘వీనస్ ఏరోస్పేస్’ సన్నాహాలు చేస్తున్నది.
ధ్వని వేగం (గంటకు 1,235 కిలోమీటర్లు) దీంతో పోల్చితే 6 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లటం ఈ ఫ్లైట్ ప్రత్యేకత. దీంట్లో న్యూయార్క్ నుంచి లండన్‌కు విమాన ప్రయాణం కేవలం 60 నిమిషాలు పడుతుందట. సంప్రదాయ విమానాల కంటే అత్యంత ఎత్తుకు హైపర్‌సానిక్ జెట్ విమానాలు ఎగురుతాయి. అంతరిక్షం అంచునకు చేరుకుంటాయి. ప్రయాణికులు సైతం అత్యంత ఉత్కంఠభరితమైన అనుభూతిని పొందుతారు.