క్రిస్ట్‌చర్చ్ : స్వదేశంలో వెస్టిండీస్‌తో మంగళవారం నుంచి ఆరంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ మొదటి రోజు తడబడింది. విండీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 231/9తో నిలిచింది.
కేన్ విలియమ్సన్ (52), బ్రాస్‌వెల్ (47) రాణించారు. విండీస్ బౌలర్లలో రోచ్, షీల్డ్స్, గ్రీవ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.