Taiwan Open : భారత అథ్లెటిక్స్‌లో సంచనంగా మారిన జ్యోతి ఎర్రాజీ (Jhyothi Yarraji) మరోసారి మెరిసింది. 10 రోజుల క్రితం ఆసియా ఛాంపియన్షిప్స్(Asian Championships)లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం వారం రోజుల వ్యవధిలోనే మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో తనకు తిరుగులేదని చాటుతూ తైవాన్ ఓపెన్ (Taiwan Open) లోనూ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో చిరుతలా పరుగెత్తిన జ్యోతి 12.99 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్, మహిళల 1500 మీటర్ల పరుగులో పూజలు కూడా స్వర్ణంతో మనదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. దక్షిణ కొరియా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో జ్యోతి ఎర్రాజీ స్వర్ణ పతకంతో యావత్ భారతావనిని సంబురాల్లో ముంచెత్తింది. మే 29 జరిగిన పోటీల్లో ఆమె 12.96 సెకన్లలోనే ఫినిషింగ్ లైన్ చేరుకొని పసిడి మోత మోగించింది. అదే జోష్‌తో తైవాన్ ఓపెన్‌లోనూ సత్తా చాటిందీ స్ప్రింటర్.
DOUBLE HURDLES GOLD IN TAIWAN OPEN
Asian Champion Jyothi Yarraji clocked 12.99s to win 🥇 in Women’s 100m Hurdles.
Tejas Shirse clocked 13.52s to win 🥇in Men’s 110m Hurdles at Taiwan Open – World Athletics Continental Tour Bronze event. pic.twitter.com/VNjYJB6358
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) June 7, 2025
100 మీటర్ల పరుగులో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. శనివారం ప్రత్యర్థులకు వెనక్కి నెట్టేస్తూ లక్ష్యం వైపు రాకెట్లా దూసుకెళ్లింది. అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. జపాన్ అథ్లెట్లు సుకా తెరడా(13.04 సెకన్లు), చిసాటో కియోయమ (13.10 సెకన్లు) వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు.
Jyothi Yarraji Wins Taiwan Open 🚨 Gold
What a recovery once again when you thought the race was almost gone, come 7th hurdle and the hurdle Queen unleashed power 🔥 pic.twitter.com/tKmpRj2SZe
— IndiaSportsHub (@IndiaSportsHub) June 7, 2025
మహిళల 1500 మీటర్ల ఫైనల్లో పూజా స్వర్ణం సాధించగా.. పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్ పసిడితో మెరిశాడు. ఫైనల్లో అబ్దుల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ 16.21 మీటర్ల దూరం దుమికి నంబర్ 1 స్థానంలో నిలిచాడు. గతంలో అతడి బెస్ట్.. 17.19 మీటర్లుగా ఉంది.
ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న పూజ ఈసారి పసిడిని పట్టేసింది. శనివారం జరిగిన 1500 మీటర్ల రేసులో అలుపెరగకుండా పరుగెత్తిన తను అనుకున్నట్టే అందరికంటే ముందుగా 4 నిమిషాల 11.63 సెకన్లలో ఫినిషింగ్ లైన్ దాటింది.
POOJA WINS THE GOLD MEDAL FOR INDIA 🥇
Pooja clocked Championship Record timing of 4:11.63 mins to clinch the Gold Medal in Women’s 1500m at Taiwan Athletics Open 2025 💪
First Gold Medal for India at Taiwan Open in 2025 Edition, Well Done POOJA 🇮🇳👏 pic.twitter.com/CvE3hgCITg
— The Khel India (@TheKhelIndia) June 7, 2025