Karimnagar | తిమ్మాపూర్,జూన్7: తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బోర్ర శంకర్ అనారోగ్యంతో శనివారం అకాల మరణం చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పేద కుటుంబం కావడంతో చలించిన ఆయన దహన సంస్కారాలు నిమిత్తం రూ.15వేలు ఆర్థిక సాయం అందజేశాడు.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అండగా ఉండాలని అదైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా ముందుటామని చెప్పారు. స్థానిక నాయకులతో కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు నాయకులు వేల్పుల మల్లయ్య, మాతంగి అంజయ్య, బోర్ర రవి, బోర్ర శ్రీనివాస్, గాజ సాగర్, తదితరులు ఉన్నారు.