Karimnagar | హుజూరాబాద్ టౌన్, జూన్ 7 : పట్టణానికి చెందిన నాగార్జున డైరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు తన డైరీకి పాలు సరఫరా చేసే హుజూారాబాద్ మండలం మంతెనపల్లికి చెందిన పాడి రైతు మంతెన అయిలయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ. 10116 అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ నాగార్జున డైరీకి పాలు సరఫరా చేసే ప్రతీ గ్రామంలోని పాడి రైతు కుటుంబంలోని కుమార్తె వివాహానికి పుస్తె మట్టె ఆనవాయితీగా అందిస్తున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు 577 మందికి రైతు కుమార్తెల వివాహానికి రూ.58,36,932 అందించనున్నట్లు తెలిపారు. పాడి పశువుల కొనుగోలుకు రుణాలు , సాధారణ బీమా, ప్రమాద బీమా లక్ష రూపాయలు, పశువులకు బీమా, వైద్య సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. దీంతో డైరీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులుగా భావించి మా వెన్నంటే ఉంటున్నారని అన్నారు. ప్రైవేట్ డైరీ రంగంలో అత్యధిక పాలసేకరణ కలిగిన డైరీగా నాగార్జున డైరీ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గణేష్ రావు, ఏజీఎం ఆకునూరి సుధాకర్, సీసీఎం మల్లారెడ్డి, రూటు సూపర్వైజర్ శ్రీధర్ రావు, ఏజెంట్ నరేందర్ రెడ్డి, గ్రామరైతులు పాల్గొన్నారు.