IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న టీమిండియా(Team India) సిరీస్ విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను తక్కువకే ఆలౌట్ చేసిన భారత్… ఆ తర్వాత ధాటిగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(24 నాటౌట్), యశస్వీ జైస్వాల్(16 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. ఎడాపెడా బౌండరీలో బాది 8 ఓవర్లలోనే 40 పరుగులు పిండుకున్నారు.
దాంతో, భారత జట్టు మూడో రోజు ఇంగ్లండ్ పై చేయి సాధించింది. రోహిత్ సేన సిరీస్‌ను ఒడిసి పట్టేందుకు నాలుగో రోజు 152 పరుగులు కావాలంతే. అయితే.. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మనోళ్లు చిన్న టార్గేట్‌ను ఛేదిస్తారా? లేకపోతే చేతులెత్తేస్తారా? అనేది చూడాలి.
End of a terrific day in Ranchi! 🏟️#TeamIndia need 152 more runs to win on Day 4 with 10 wickets in hand 👌👌
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/JPJXwtYrOx
— BCCI (@BCCI) February 25, 2024
తొలి రోజు నుంచి ఆధిపత్యం చేతులు మారిన టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. యశస్వీ జైస్వాల్(), ధ్రువ్ జురెల్ పోరాటంతో 307 రన్స్ కొట్టిన భారత్ ఆ తర్వాత ఇంగ్లండ్ పని పట్టింది. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లు విజృంభించడంతో ఇంగ్లండ్ జట్టును 145 పరగులకే ఆలౌట్ చేసింది. అనంతరం 192 పరుగుల ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్, యశస్వీ శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ దంచికొట్టడంతో భారత్ విజయానికి మరింత చేరువైంది.
భారత్‌ను 307కే కట్టడి చేసిన ఇంగ్లండ్‌కు ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించినా.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాయాజాలంంతో వరుస బంతుల్లో ఓపెనర్ బెన్ డకెట్(10)ఓలీ పోప్(0)ను ఎల్బీగా వెనక్కి పంపి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జో రూట్(11, జాక్ క్రాలే(60) ఆదుకునే ప్రయత్నం చేశారు.
ICYMI!
How good was that grab from Dhruv Jurel 🙌
An excellent day for the #TeamIndia wicketkeeper in Ranchi 👏👏#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/UpwFx8juKt
— BCCI (@BCCI) February 25, 2024
కానీ, రూట్‌ను ఎల్బీగా ఔట్ చేసిన అశ్విన్ ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ క్రాలే బజ్ జడేజా బౌలింగ్‌లో సింగిల్ తీసి సుదీర్ఘ ఫార్మాట్లో 13వ అర్ధ శతకం నమోదు చేశాడు. ఆ సమయంలో బంతి అందుకున్న కుల్దీప్ క్రాలే, బెయిర్‌స్టో(30), బెన్ స్టోక్స్(4)లను వెనక్కి పంపి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
రాంచీ టెస్టులో కుర్రాడు ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. అరంగేట్రం టెస్టులో 4 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న అతడు ఇప్పుడు 10 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. అయితేనేమి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ బషీర్ ధాటికి ఒకదశలో 117 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌట్ ప్రమాదంలో పడిన టీమిండియాను జురెల్ ఆదుకున్నాడు.
𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎!
He showed grit and played a knock to remember 👌 👌
Watch Dhruv Jurel’s solid show with the bat in Ranchi 🎥 🔽#TeamIndia | #INDvENG | @dhruvjurel21 | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 25, 2024
ఒత్తిడిలోనూ పట్టుదలగా, పరిస్థితులకు తగ్గట్టు ఆడిన జురెల్ గోడలా నిలబడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. మూడో రోజు కుల్దీప్ యాదవ్(28) ఔటయ్యాక అటాకింగ్ గేమ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేసి భారత్‌ను పోటీలో నిలిపాడు.149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 రన్స్ కొట్టాడు. అతడి జోరు చూస్తుంటే సెంచరీ కొట్టేలా కనిపించాడు. కానీ, టామ్ హర్ట్లే సూపర్ డెలివరీతో జురెల్‌ను బౌల్డ్ చేశాడు.