Josh Inglis : పవర్ హిట్టర్ల విధ్వంసాలకు కేరాఫ్ అయిన టీ20ల్లో మరో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా చిచ్చర పిడుగు జోష్ ఇంగ్లిస్ (Josh Inglis) వేగవంతమైన శతకం బాదేశాడు. శుక్రవారం స్కాట్లాండ్(Scotland) బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లిస్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 43 బంతుల్లోనే అతడు సెంచరీ సాధించాడు. తద్వారా పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన తొలి ఆస్ట్రేలియన్‌గా చరిత్ర సృష్టించాడు. మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్ (2013లో, 47 బంతుల్లో)పేరిట ఉన్న రికార్డును ఇంగ్లిస్ బద్ధలు కొట్టాడు.
పొట్టి క్రికెట్ స్పెషలిస్ట్ అయిన ఇంగ్లిస్ శుక్రవారం తన తడాఖా చూపించాడు. స్కాట్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపాడు. 23 పరుగులకే ఓపెనర్లు ఔటనా వెనక్కి తగ్గని ఇంగ్లిస్ శతక గర్జన చేశాడు. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌తో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
Despite Josh Inglis’s century, Australia fall short of the 200-run mark vs Scotland 🏏https://t.co/bx7Vp4rAAT #SCOvAUS pic.twitter.com/hvt1e0TbYe
— ESPNcricinfo (@ESPNcricinfo) September 6, 2024
క్రీజులో ఉన్నంత సేపు ఉతుకుడే పనిగా పెట్టుకున్న ఈ వికెట్ కీపర్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 103 కొట్టి ఔటయ్యాడు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్(20), టిమ్ డేవిడ్(17)లు కూడా బాదేయడంతో, ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 రన్స్ కొట్టింది. ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన వాళ్లలో ఇంగ్లిస్ టాప్‌లో ఉన్నాడు. టీ20ల్లో ఆసీస్ బ్యాటర్లు ఎవరంటే..?
Quickest hundreds for Australia in men’s T20 internationals:
43 balls: Josh Inglis (2024)
47 balls: Aaron Finch (2013)
47 balls: Josh Inglis (2023)
47 balls: Glenn Maxwell (2023)
49 balls: Glenn Maxwell (2016)#SCOvAUS pic.twitter.com/Yf6LyKRf3d— cricket.com.au (@cricketcomau) September 6, 2024
1. జోష్ ఇంగ్లిస్ 43 బంతుల్లో – 2024
2. అరోన్ ఫించ్, 47 బంతుల్లో – 2013
3. జోష్ ఇంగ్లిస్ 47 బంతుల్లో-2023
4. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 47 బంతుల్లో – 2023
5. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 49 బంతుల్లో – 2016