తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavams) వాహనసేవల వివరాలతో కూడిన బుక్లెట్ను టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం బుక్లెట్(Booklet)ను ఆవిష్కరించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో బ్రహ్మోత్సవాల సమాచారంతో ఆకట్టుకునే రంగుల చిత్రాలతో బుక్లెట్ను ముద్రించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సీఈ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.