అమరావతి : విజయవాడను ముంచేత్తిన బుడమేరు(Budameru) గండి పూడ్చివేతకు ఆర్మీ (Army) సిబ్బంది రంగంలోకి దిగింది. విపత్కర సమయంలో సైన్యం ఉపయోగించే గేబియాన్ బుట్టల ద్వారా గండ్లు పూడ్చేందుకు కావాల్సిన పరికారాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసుకున్నారు. ఆరో మద్రాస్ రెజిమెంట్(Madras Regiment) నుంచి వచ్చిన 120 మంది ఆర్మీ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.
బుడమేరు వాగుకు ఒకవైపు మూడు గండ్లు, రెండో వైపు ఏడు గండ్లు పడ్డాయి. ఒకవైపు పడ్డ మూడు గండ్లలో రెండు గండ్లను అధికారులు పూడ్చివేయగా మూడో గండి సుమారు 80-100 మీటర్ల వరకు 24 గంటల్లో పూడ్చేందుకు ఆర్మీ ప్రణాళిను సిద్ధం చేసుకుంది. విజయవాడ నగరం వైపు పడ్డ మూడు గండ్ల నగరాన్ని అతలకుతలం చేశాయి. సుమార 32 కాలనీలు మునిగిపోయి సుమార లక్ష మంది నిరాశ్రయులయ్యారు.
ముందు జాగ్రత్తగా బాధితులను ఇతర ప్రాంతాలకు తరలించారు. అనేక మంది తమతమ బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. ఇనుప చువ్లతో బుట్టలా చేసి దానిని పెద్దరాళ్లు, ఇసుక బస్తాలతో నింపడం ద్వారా గండి పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడించింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మూడురోజులుగా బుడమేరుపైనే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు.