ముంబై: త్వరలో మొదలయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 మిగతా సీజన్‌కు పలువురు క్రికెటర్లు దూరం అయ్యారు. వ్యక్తిగత కారణాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాల కథనం.
‘ఐపీఎల్-2021 మిగతా సీజన్లో డేవిడ్ మలన్ ఆడటం లేదు. టీ-20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ వెంట వెంటనే ఉన్నాయి. దీంతో ఆయన కుటుంబానికి సమయం ఇవ్వాలనుకుంటున్నాడు. డేవిడ్ మలన్ స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ అడెన్ మార్క్రమ్ ఆడతాడు’ అని పంజాబ్ కింగ్స్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
IT Returns | బిగ్ రిలీఫ్.. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించిన కేంద్రం
RBI rule on ATM | గ్రామీణులకు షాక్.. ఏటీఎంలు ఎత్తేస్తున్న బ్యాంకులు?!