లండన్: శ్రీలంకతో స్వదేశంలో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ మొదటి రోజే భారీ స్కోరు చేసింది. ఆ జట్టు మాజీ సారథి జో రూట్ (143) భారీ శతకంతో కదం తొక్కడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్..
88 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. రూట్‌కు మొత్తంగా 49వది. అట్కిన్సన్ (74 నాటౌట్), డకెట్ (40), బ్రూక్ (33) రాణించారు.