PAK vs CAN : పొట్టి ప్రపంచ కప్‌లో బోణీ కోసం నిరీక్షిస్తున్న పాకిస్థాన్(Pakistan)కు బౌలర్లు మరో చాన్స్ ఇచ్చారు. న్యూయార్క్ స్టేడియంలో కెనడా(Canada)ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. పాక్ పేసర్ల ధాటికి సాద్ బిన్ సేన 106 పరుగులకే పరిమితమైంది. లో స్కోరింగ్ పిచ్‌పై ఓపెనర్ అరోన్ జాన్సన్(52) ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆఖర్లో కలీమ్ సనా(13 నాటౌట్)లు కెప్టెన్ సాద్ బిన్ జాఫర్(10)లు దంచడంతో పాక్‌కు కెనడా మోస్తురు లక్ష్యాన్ని ఉంచగలిగింది.
టాస్ గెలిచిన బాబర్ కెనడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.బౌన్సీ పిచ్‌పై మహ్మద్ అమిర్, షాహీన్ ఆఫ్రిది విజృంభణతో కెనడా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో ఆఖరి బంతికి ఐర్లాండ్‌పై అర్ధ శతకంతో మెరిసిన కిర్టన్(0) రనౌటయ్యాడు. 43 పరుగులకే మూడు వికెట్లు పడినా.. ఓపెనర్ అరోన్ జాన్సన్(52) పట్టుదలగా ఆడాడు. పాక్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును నడిపించాడు. ఇమాద్ వసీం ఓవర్లో భారీ సిక్సర్‌తో అర్ధ సెంచరీ సాధించాడు. కెనడాకు పోరాడగలిగే స్కోర్ అందించాలనుకున్న అతడు నసీం షా వేసిన షార్ట్ బంతిని అంచనా వేయలేక బౌల్డ్ అయ్యాడు. ఆ
A double-wicket over from Haris Rauf puts Pakistan in control!
🇨🇦 55/5 after 10 overs https://t.co/veYkPxHMKt | #PAKvCAN | #T20WorldCup pic.twitter.com/WP1ZcskzJ6
— ESPNcricinfo (@ESPNcricinfo) June 11, 2024
తర్వాత రవుఫ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కెనడాను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఆ పరిస్థితుల్లో కెప్టెన్ సాద్ బిన్ జాఫర్(10), కలీమ్ సనా(13 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. సాద్ వెనుదిరిగాక.. కలీమ్ ధనాధన్ ఆడాడు. నసీం వేసిన 20వ ఓవర్లో సిక్సర్ బాది జట్టు స్కోర్ 100 దాటించాడు. పాక్ బౌలర్లలో రవుఫ్(226), అమిర్(213)లు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.