Deepinder Goyal: జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ముఖంపై ధరించిన ఒక డివైజ్ గురించి అంతటా చర్చిస్తున్నారు. ఆ డివైజ్ పేరు.. దాన్ని ఎందుకు వాడుతారు వంటి వివరాల్ని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. దీనిపై కిడ్ బీ సంస్థ ఫౌండర్ స్వప్నిల్ శ్రీవాస్తవ్ ఎక్స్ వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. దీపిందర్ ధరించిన డివైజ్ పేరు ‘టెంపుల్’. ఈ డివైజ్ ను ఆయన కొంతకాలంగా వాడుతున్నారు. తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో దీపిందర్ దీన్ని ధరించి కనిపించారు.
స్వప్నిల్ శ్రీవాస్తవ్ ప్రకారం.. ఈ టెంపుల్ డివైజ్ ను వైద్యపరంగా వాడుతారు. దీన్ని ముఖంపై ధరించడం వల్ల మెదడుకు రక్త సరఫరా ఎలా జరుగుతుందో నిరంతరం తెలుసుకోవచ్చు. ఇటీవల దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. మనుషులు వ్యాధుల వల్ల మరణించరని, గ్రావిటీ వల్ల చనిపోతారని చెప్పాడు. గ్రావిటీ కారణంగా మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుందని, దీంతో వృద్ధాప్యం వచ్చి మరణం సంభవిస్తుందని ఆయన చెప్పారు. అందువల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గకుండా చేసే అంశంపై తాను పనిచేస్తున్నట్లు గతంలో వెల్లడించాడు. దీనికి సంబంధించి గత ఏడాది నవంబర్ లో ఒక థియరీని దీపిందర్ విడుదల చేశాడు. బహుశా అది ఈ డివైజే అయ్యుండొచ్చని, అందుకే దీని తయారీ సంస్థ పేరు ఎటర్నల్ (అంతం లేనిది) అని స్వప్నిల్ అభిప్రాయపడ్డాడు.
Deepinder wearing a device called Temple to track blood flow to the brain and it’s wild and fascinating.
His belief is simple and radical.
People don’t die because of disease.
They die because of gravity.
Over time, gravity slows blood flow to the brain.
That triggers ageing.… https://t.co/jWWtZycjWT— Swapnil Srivastav (@theswapnilsri) January 4, 2026
గోయల్ ఆ డివైజ్ ను ప్రయోగాత్మకంగా ఏడాది నుంచి వాడుతున్నట్లు తెలుస్తోంది. దీనిద్వారా మెదడుకు రక్త సరఫరా ఎలా జరుగుతుందో తెలుసుకునే వీలవుతుందని అతడి నమ్మకం. అయితే, ఈ సిద్ధాంతాన్ని చాలా మంది నిపుణులు కొట్టిపారేస్తున్నారు. పైగా ఈ డివైజ్ పనితీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిమ్స్ కు చెందిన ఒక డాక్టర్ స్పందిస్తూ.. ఈ సిద్ధాంతానికి ఎలాంటి శాస్త్రీయ ప్రమాణం లేదని, ప్రజలు ఇలాంటి డివైజ్లు కొని డబ్బులు వేస్ట్ చేసుకోకూడదని సూచించారు. మరోవైపు ఈ డివైజ్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.