TS TET | హైదరాబాద్ : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నెల 12న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2,36,487 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 3న టెట్ ప్రాథమిక కీని విడుదల చేశారు.