హనుమకొండ చౌరస్తా, జనవరి 5 : పీడీఎస్‌యూ(PDSU) కాకతీయ యూనివర్సిటీ(KU) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా వి.కావ్యతో పాటు ఉపాధ్యక్షులుగా పి.అనూష, లోకేష్, అనిల్, సహాయ కార్యదర్శిగా గణేష్, సంగీత, నాగరాజు, కోశాధికారి వంశీ, సభ్యులుగా యాదగిరి, శ్రీజ,చందు, వంశీ, సాధన, దామోదర్, శ్రీకాంత్, ప్రసన్న ,అరుణ్, వినోద్, బావు సింగ్, మనోజ్ కుమార్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, మెస్ డిపాజిట్ విధానాన్ని ఎత్తివేసి, యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఉచితంగా మెస్ సౌకర్యం కల్పించాలన్నారు.
సెల్ప్ ఫైనాన్స్ కోర్సులన్నింటిని రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్‌టీచింగ్ పోస్టులన్నింటిని శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలని, యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఇతర టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించాలన్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించాలని, అడ్మిషన్ పొందిన పరిశోధక విద్యార్థులందరికీ రాష్ర్ట ప్రభుత్వం నెలకు రూ.35వేల ఫెలోషిప్ అందించాలని, వెనుజుల దేశంపై అమెరికా సామ్రాజ్యవాద దురహంకర దాడిని ఆపాలని వారు తీర్మానించారు.