INDW vs NZW : న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బౌండరీల మోతమోగిస్తున్న భారత బ్యాటర్ల జోరుకు వర్షం అంతరాయం కలిగింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (122), స్మృతి మంధాన(109) తరహాలో రెచ్చిపోతున్న జెమీమా రోడ్రిగ్స్(69 నాటౌట్) మెరుపులకు వరుణుడు బ్రేక్ వేశాడు. 48 ఓవర్ సమయంలోనే చినుకులు మొదలయ్యాయి. ఆ ఓవర్ పూర్తయ్యేసరికి వర్షం ఊపందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికీ టీమిండియా స్కోర్.. కాగా జెమీమాతో కలిసి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (10 నాటౌట్) అజేయంగా ఉన్నారు.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్లు స్మృతి మంధాన(109).. ప్రతీకా రావల్(122)లు వీరకొట్టుడుతో రెండొందల భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ తర్వాత సుజీ బేట్స్ ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన మంధాన బౌండరీ వద్ద దొరికిపోయింది. దాంతో.. 212 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
She’s back! 🔥 pic.twitter.com/oBN7TvQAtI
— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2025
అనంతరం.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్)సైతం దూకుడుగా ఆడింది. 108 పరుగుల వద్ద ప్రతీక ఇచ్చిన తేలికైన క్యాచ్ వదిలేసింది. కానీ, కాసేపటికే అమేలియా కేర్ ఓవర్లో వరుసగా రెండో సిక్సర్ కొట్టబోయిన ప్రతీక ఔటయ్యింది. అప్పటికి టీమిండియా స్కోర్.. 288. ఓపెనర్లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరినా.. జెమీమా బౌండరీలతో విరుచుకుపడింది. కట్, స్వీప్.. ఆటాకింగ్ షాట్లతో ఫోర్లు బాదుతూ వన్డేల్లో 8వ అర్ధ శతకం పూర్తి చేసుకుంది.