Jay Shah: ఐసీసీ చైర్మన్గా జై షా..! ఆ రెండు కీలక పదవులకు రాజీనామా..?
Jay Shah: బీసీసీఐ సెక్రటరీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా మరో కీలక పదవిని దక్కించుకోబోతున్నాడా..? జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్గా ఎన్నిక కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
Jay Shah: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా మరో కీలక పదవిని దక్కించుకోబోతున్నాడా..? జై షా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్గా ఎన్నిక కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ ఏడాది నవంబర్లో ఐసీసీ చైర్మన్గా జై షా బాధ్యతలు చేపట్టనున్నాడని, అందుకు గ్రౌండ్ వర్క్ కూడా చకాచకా ముగిస్తున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ వాదనలను మరింత బలం చేకూర్చేలా అతడు త్వరలోనే రెండు కీలక పదవులకు రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
జై షా ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్నాడు. త్వరలోనే ఏసీసీ వార్షిక సాధారణ సమావేశాలు (ఏజీఎం) ఇండోనేషియాలోని బాలీలో జరగాల్సి ఉంది. ఈ సమావేశాల్లోనే జై షా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. ఏసీసీ అధ్యక్షుడి పదవీ కాలం రెండేండ్లు కాగా ప్రస్తుతం జై షా రెండో ఏడాదిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
Jay Shah set to run for the post of ICC Chairman in November. (Cricbuzz). pic.twitter.com/I4c5TIQi4d
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2024
ఇక 2019లో బీసీసీఐ సెక్రటరీగా ఎన్నికైన జై షా.. భారత క్రికెట్ బోర్డుకు కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నాడు. ప్రెసిడెంట్గా రోజర్ బిన్నీ ఉన్నా అధికారాలన్నీ జై షా వద్దే ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. అయితే ఐసీసీ చైర్మన్గిరి కోసం జై షా బీసీసీఐ సెక్రటరీతో పాటు ఏసీసీ చీఫ్గా వైదొలగనున్నట్టు తెలుస్తున్నది. దీనిపై త్వరలోనే పూర్తివివరాలు వెల్లడవనున్నాయి.
Jay Shah might leave ACC President Seat to become ICC Chairman. (Cricbuzz) pic.twitter.com/cpMzPRqmg3
— CricketGully (@thecricketgully) January 30, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

