Zaheer Khan : ఐపీఎల్ పండుగను ఆస్వాదిస్తున్న అభిమానులు జూన్‌లోనూ క్రికెట్ జాతరలో ఖుషీ కానున్నారు. వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరిగే టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) కోట్లాది మందిని అలరించనుంది. ఈసారి మెగా టోర్నీ టైటిల్‌పై కన్నేసిన టీమిండియా (Team India) ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 15 మందితో స్క్వాడ్‌ను వెల్లడించిన మరునాడే వెటరన్ స్పీడ్‌స్టర్ జహీర్ ఖాన్(Zaheer Khan) తన జాబితాను ప్రకటించాడు.
పదిహేడో సీజన్ ఐపీఎల్లో అదరగొడుతున్న స్టార్ ఆటాళ్లను జహీర్ తుది స్క్వాడ్‌లోకి తీసుకున్నాడు. వికెట్ కీపర్‌గా రేసులో ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul), సంజూ శాంసన్(Sanju Samson)లను కాదని రిషభ్ పంత్ (Rishabh Pant) ఒక్కడినే ఎంపిక చేశాడు. ఇక ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్(Yash Dayal)కు పేస్ యూనిట్లో చోటు కల్పించాడు. ఫినిషర్‌గా రింకూ సింగ్, ఆల్‌రౌండర్‌గా శివం దూబేలను జహీర్ పిక్ చేసుకున్నాడు. జహీర్ ప్రకటించిన స్క్వాడ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..?
బ్యాటర్లు – రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్ / శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్.
ఆల్‌రౌండర్లు – శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.
వికెట్ కీపర్ – రిషభ్ పంత్.
బౌలర్లు – జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాల్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్.
టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి ఏండ్లు గడుస్తున్నాయి. పదకొడేండ్లుగా ఊరిస్తున్న అందని ద్రాక్షను పట్టేసేందుకు రోహిత్ సేన ఈసారి సర్వ శక్తులు ఒడ్డనుంది. నిరుడు ఏకంగా రెండు ఐసీసీ ఫైనల్లో భారత్ భంగపడింది. టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023), వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) టైటిల్ పోరులో ఆస్ట్రేలియాకు తలవొంచింది.