DC vs MI : ఢిల్లీ నిర్దేశించిన భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) రెండు వికెట్లు పడ్డాయి. ఓపెనర్లు ఇషాన్ కిషన్(20), రోహిత్ శర్మ() లు ఔటయ్యారు. ఖలీల్ అహ్మద్ ఓవర్లో రోహిత్ షాయ్ హోప్ చేతికి చిక్కగా.. ఆ కాసేపటికే ఇషాన్ భారీ షాట్ ఆడి అక్షర్ పటేల్‌కు దొరికిపోయాడు. దాంతో,45 పరుగుల వద్ద ముంబై రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(16), తిలక్ వర్మ(1)లు క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లకు స్కోర్.. 54/2
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ బాదేసింది. సొంత మైదానంలో ఢిల్లీ కుర్రాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ సిక్సర్లతో విరుచుకుపడగా.. మిడిల్లో షాయ్ హోప్(41), ట్రిస్టన్ స్టబ్స్(48 నాటౌట్), కెప్టెన్ రిషభ్ పంత్(29)లు విధ్వంసం సృష్టించారు. దాంతో, పంత్ సేన 4 వికెట్ల నష్టానికి 257 రన్స్ చేయగలిగింది.