DC vs MI | ముంబై టాపార్డర్ ఫ్లాప్.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే విజయం
DC vs MI : ఐపీఎల్ పదిహేడో సీజన్లో మరో ఉత్కంఠ పోరు ఉర్రూతలూగించింది. శనివారం భారీ స్కోర్లు నమోదైన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Cpitals) సూపర్ విక్టరీ కొట్టింది. జేక్ ఫ్రేజర్, స్టబ్స్ మెరుపులతో రికార్డు స్కోర్ బాదిన ఢిల్లీ.. ముంబై ఇండయన్స్(Mumbai Indians)ను 10 పరుగులతో చిత్తు చేసింది.
DC vs MI : ఐపీఎల్ పదిహేడో సీజన్లో మరో ఉత్కంఠ పోరు ఉర్రూతలూగించింది. శనివారం భారీ స్కోర్లు నమోదైన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Cpitals) సూపర్ విక్టరీ కొట్టింది. జేక్ ఫ్రేజర్, స్టబ్స్ మెరుపులతో రికార్డు స్కోర్ బాదిన ఢిల్లీ.. ముంబై ఇండయన్స్(Mumbai Indians)ను 10 పరుగులతో చిత్తు చేసింది. టాపార్డర్ ఫ్లాప్ షోతో నిరాశపరిచినా ముంబై కడదాకా పోరాడి ఓడింది. తిలక్ వర్మ(63), కెప్టెన్ .హార్దిక్ పాండ్యా(44)లు చెలరేగినా ముంబైని గెలిపించలేకపోయారు. ఢిల్లీ యువ పేసర్ రసిక్ దార్ సలాం (333) విజృంభించగా పంత్ సేన 10 పరుగులతో విజయభేరి మోగించింది. వరుసగా రెండో గెలుపుతో ఢిల్లీ 10 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది.
ఢిల్లీ నిర్దేశించిన భారీ ఛేదనలో ముంబై ఇండియన్‌సకు శుభారంభం దక్కలే. ఖలీల్ అహ్మద్, ముకేశ్ ధాటికి 45 పరుగులకే ఓపెనర్లు ఇషాన్ కిషన్(20), రోహిత్ శర్మ(8) లు పెవిలియన్ చేరారు. ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(26)ను వెనక్కి పంపి ముంబైని ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే.. తిలక్ వర్మ(63), హార్దిక్ పాండ్యా(44)లు ధనాధన్ ఆడి స్కోర్ బోర్డును పరుగు పెట్టించారు. ఈ జోడీని విడదీసేందుకు పంత్.. కుర్రాడు రసిక్ దార్ సలాంకకు బంతి అందించి సక్సెస్ అయ్యాడు.
Phew. 2️⃣ Points. Swaad Aa Gaya 💙❤️ pic.twitter.com/4sG1c95yNg
— Delhi Capitals (@DelhiCapitals) April 27, 2024
ఒకే ఓవర్లో..
రసిక్ ఒకే ఓవర్లో పాండ్యా, నేహల్ వధేరా(4)ను ఔట్ చేసి ముంబైని మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్(37) అండగా తిలక్ బౌండరీల మోతతో ముంబైలో గెలుపు దిశగా నడిపారు. 18వ ఓవర్లో ముకేశ్ ఎల్బీగా డేవిడ్‌ను వెనక్కి పంపగా.. ఆఖరి ఓవర్లో 25 రన్స్ అవసరమవ్వగా.. తిలక్ తొలి బంతికే రనౌటయ్యాడు. ల్యూక్ వుడ్(9), పీయూష్ చావ్లా(10)లు చెరొక బౌండరీ బాదారు. ఆఖరి బాల్‌కు చావ్లా ఔటయ్యాడు. దాంతో ఢిల్లీ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.
Rasikh 𝐈𝐌𝐏𝐀𝐂𝐓 Dar 🫡🔥pic.twitter.com/JrWtxJKchJ
— Delhi Capitals (@DelhiCapitals) April 27, 2024
15 బంతుల్లో హాఫ్ సెంచరీ
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ బాదేసింది. ఓపెనర్ ఫ్రేజర్(84) ముంబై పేసర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రాతో సహా అందర్నీ ఉతికారేస్తూ కేవలం 15 బంతుల్లోనే మరోసారి హాఫ్ సెంచరీ బాదేశాడు. అతడికి అండగా అభిషేక్ పొరెల్(36) కూడా తొలి వికెట్‌కు 114 రన్స్ జోడించారు.ఢిల్లీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో ముంబై బౌలర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాడు.
Roar Macha in a nutshell 🔥 pic.twitter.com/AFeMeYbb2U
— Delhi Capitals (@DelhiCapitals) April 27, 2024
ఆ తర్వావ వచ్చిన పంత్(29).. హోప్(41)లు బాదేశారు. హోఫ్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్(48 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ల్యూక్ వుడ్ వేసిన 18వ ఓవర్లో రెచ్చిపోయిన స్టబ్స్ ఒక్క బంతిని వదలకుండా వరుసగా.. 4, 4, 6, 4, 4, 4 బాదేశాడు. ఆ తర్వాత పంత్ ఔటైనా.. స్టబ్స్, అక్షర్ పటేల్ (11 నాటౌట్)లు ధనాధన్ ఆడి ఢిల్లీకి భారీ స్కోర్ అందించారు. దాంతో, పంత్ సేన 4 వికెట్ల నష్టానికి 257 రన్స్ చేయగలిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

