బార్బడోస్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 3-2 తేడాతో సొంతం చేసుకున్నది. ఆఖరి మ్యాచ్‌లో వెస్టిండీస్ 17 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా.. సామ్ బిల్లింగ్స్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ వికెట్లను హోల్డర్ తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది. రోవ్మాన్ పావెల్ 17 బంతుల్లో 35 రన్స్ చేయగా.. పోలార్డ్ 41 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ విన్స్ అత్యధికంగా 55 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ రన్ ఛేజ్‌లో 162 రన్స్‌కు ఆలౌటైంది. హోల్డర్ 27 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు.