T20 Cricket : రికార్డులకు నెలవైన పొట్టి క్రికెట్లో మరో సంచలనం. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (Marco Jansen) టీ20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ కొట్టాడు. సెంచూరియన్ మైదానంలో టీమిండియా జాన్సెన్ 16 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. దాంతో, భారత జట్టుపై వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేశాడు. జాన్సెన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో కామెరూన్ గ్రీన్ పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రీన్ 2022లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కేవలం 19 బంతుల్లోనే యాభై బాదేశాడు. ఇప్పుడు జాన్సెన్ ఆ రికార్డును బద్ధలు కొట్టడం విశేషం. తద్వారా టీమిండియాపై పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన వీరుడిగా జాన్సెన్ రికార్డు నెలకొల్పాడు. దాంత్, కామెరూన్ గ్రీన్ రెండో స్థానానికి పడిపోయాడు.
A Heroic Knock!✨
Marco Jansen gave it his all in our chase against India tonight.👏✨🏟️
Bringing up his first T20i half-century in the process🏏#WozaNawe #BePartOfIt#SAvIND pic.twitter.com/IwIiy6WQbM
— Proteas Men (@ProteasMenCSA) November 13, 2024
మూడో ప్లేస్ ఎవరిదంటే..? జాన్సన్ చార్లెస్ది. వెస్టిండీస్ ఓపెనర్ అయిన చార్లెస్ 2016లో భారత్‌పై 20 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. శ్రీలంక మాజీ సారథి దసున్ శనక (Dasun Shanaka) సైతం 20 బంతుల్లో యాభైకి చేరుకున్నాడు.
ఇక.. దక్షిణాఫ్రికా తరఫున చూస్తే రెండో వేగవంతమైన ఫిఫ్టీ జాన్సెన్దే. ఓపెనర్ క్వింటన్ డికాక్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2023లో వెస్టిండీస్‌పై చెలరేగిన డికాక్ కేవలం 15 బంతుల్లోనే యాభై కొట్టాడు. యువకెరటం ట్రిస్టన్ స్టబ్స్ 19 బంతుల్లో యాభై కొట్టేసి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ క్లబ్లో చేరాడు.
Fastest fifty against India in T20Is
16 balls – Marco Jansen, Centurion, 2024
19 balls – Cameron Green, Hyderabad, 2022
20 balls – Johnson Charles, Lauderhill, 2016
20 balls – Dasun Shanaka, Pune, 2023#SAvsIND pic.twitter.com/lMuzmVjf7P— Cricket.com (@weRcricket) November 13, 2024
సెంచూరియన్ వేదికగా సాగిన మూడో టీ20లో భారత జట్టు 219 రన్స్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్) తొలి సెంచరీతో చెలరేగగా.. అభిషేక్ శర్మ(50) దంచేశారు. అనంతరం 220 పరుగుల ఛేదనలో సఫారీ జట్టు ధాటిగా ఆడింది. హెన్రిచ్ క్లాసెన్(41)కు తోడుగా మార్కో జాన్సెన్(54) ధాటిగా ఆడి జట్టును గెలిపించినంత పనిచేశాడు. అయితే.. అర్ష్‌దీప్ సింగ్ ఆఖరి ఓవర్లో ఓ సిక్సర్ ఇచ్చినా సఫారీలను నిలువరించాడు. దాంతో, భారత జట్టు 11 పరుగుల తేడాతో గెలుపొంది నాలుగు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.