WADA : యూఎస్ ఓపెన్ గెలుపొందిన టెన్నిస్ వరల్డ్ నంబర్ 1 జన్నిక్ సిన్నర్ (Jannik Sinner)కు మరో షాక్. డోపింగ్ కేసు నుంచి బయటపడిన అతడిని ప్రపంచ డ్రగ్స్ నిరోధక సంస్థ(WADA) మాత్రం వదలిపెట్టడం లేదు. తాజాగా వాడా అతడికి వ్యతిరేకంగా కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ (కాస్)ను ఆశ్రయించింది. సిన్నర్‌పై ఒకటి లేదా రెండేండ్ల నిషేధం విధించాలని తన అప్పీల్లో డిమాండ్ చేసింది. అసలేం జరిగిందంటే..?
ఈ ఏడాది మార్చిలో సిన్నర్‌కు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. అతడి నమూనాల్లో నిషేధిత క్లొస్టెబొల్(Clostebol) డ్రగ్‌కు పాజిటివ్ వచ్చింది. దాంతో, ఈ విషయమైన అంతర్జాతీయ టెన్నిస్ సమీకృత సంఘం(ATIA) అతడిని ప్రశ్నించింది. అయితే. ఫిజయో థెరపీ చికిత్స సమయంలో అనుకోకుండా తాను క్లొస్టెబొల్ డ్రగ్ ఉన్న మందులు తీసుకొని ఉండవచ్చని, అందులో తన తప్పేమీ లేదని ఐటీఐఏకు సిన్నర్ వివరణ ఇచ్చాడు.
అతడి సమాధానంతో సంతృప్తి చెందిన టెన్నిస్ సమాఖ్య సిన్నర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో, మళ్లీ రాకెట్ అందుకున్న ఇటలీ కెరటం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన ఫైన్ పోరులో అమెరికా సంచలనం టేలర్ ఫ్రిట్జ్ (Taylor Fritz)ను చిత్తు చేసిన సిన్నర్ కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ కొల్లగొట్టాడు.
WADA appeals case of tennis player Jannik Sinner. Read more here: https://t.co/vExHGdmkZG
— WADA (@wada_ama) September 28, 2024
అయితే.. వాడా మాత్రం నిషేధిత డ్రగ్ నమూనాల్లో ఉన్నందున సిన్నర్ దోషి అని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాస్‌కు అప్పీల్ చేసింది. ఈ మేరకు తమ వెబ్సైట్లో వాడా సెప్టెంబర్ 26న సిన్నర్‌పై కాస్‌కు ఫిర్యాదు చేశామని తెలిపింది. టాప్ సీడ్ విషయంలో ట్రిబ్యూనల్ తీసుకున్న నిర్ణయం సరికాదని, తక్షణమే సిన్నర్‌పై ఏడాది లేదా రెండేండ్ల పాటు నిషధం విధించాలని విన్నవించినట్టు వెల్లడించింది.
A superhuman strength that not even a storm like this can bring down. You are tenacity, energy, and light for a sport that maybe doesn’t even realize the gem it holds in its hands.
I hope it will all be over soon and that some peace will be granted to you.Forza, always. 🦊 pic.twitter.com/Oba1G3SBr2
— jannik sinner archive (@jannikarchive) September 28, 2024