Viajaya Bharathi | హైదరాబాద్ : ప్రముఖ రచయిత్రి బి విజయభారతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమెను సనత్‌నగర్‌లోని రెనోవా ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. విజయభారతి మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతిపట్ల పలువురు రచయితలు, మేధావులు, నాయకులు సంతాపం ప్రకటించారు. దళిత సాహిత్యానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
1968లో ప్రముఖ హేతువాది, దళిత నాయకుడు, న్యాయవాది బొజ్జా తారకంను విజయభారతి వివామం చేసుకున్నారు. బొజ్జా తారకం, విజయభారతి దంపతుల కుమారుడు రాహుల్ బొజ్జా.. ఈయన ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో 1941లో ప్రముఖ రచయిత బోయి భీమన్న, నాగరత్నమ్మ దంపతులకు విజయభారతి జన్మించారు. కోఠి ఉమెన్స్ కాలేజీ నుంచి పీజీ పూర్తి చేశారు. దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం – సాంఘిక పరిస్థితులు అను అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో డాక్టరేట్ పొందిన రెండో మహిళ విజయభారతి కావడం విశేషం. తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా విజయభారతి తనదైన ముద్ర వేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | మూసీలో రక్తం పారించాలనుకుంటున్నావా..? రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్
TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు వానలు
Gandhi Bhavan | కాంగ్రెస్‌ను వెంటాడుతున్న మూసీ బాధితుల భయం.. గాంధీ భవన్ వద్ద భద్రత పెంపు